రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా పాలసీ..

రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా పాలసీ తీసుకొస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గౌడకులస్థుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన హరీష్ రావు గీత కార్మికులకు గుడ్ న్యూస్ తెలిపారు.

గీత కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో కల్లుడిపోలు తెరిపించారన్నారు. హైదరాబాద్‌లో కల్లు డిపోలు తెరవడం వల్ల లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. కల్లు డిపోల మీద ఒక్క కేసు కూడా పెట్టడంలేదని గుర్తు చేశారు. ఎక్సైజ్ మామూళ్లు లేకుండా, అధికారుల వేధింపులు లేకుండా చేసి గీతకార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు.

కరోనా రాకపోతే ఇప్పటికే అన్ని జిల్లాల్లో నీరా షాపులు ప్రారంభించేవాళ్లమని.. త్వరలో హైదరాబాద్ లో ప్రారంభిస్తామని వివరించారు. నీరా దుకాణాలు హైదరాబాద్ లో సక్సెస్ అయితే.. అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామని.. 50 ఏళ్లకే గీతకార్మికులకు 2016 రూపాయల ఫించన్ ఇస్తున్నామని గుర్తు చేశారు. ముదిరాజ్ లకు ఇచ్చినట్లుగా గీతకార్మికులకు లూనా(మోపెడ్)లు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు.