ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

Employees' Provident Fund Organisation
Employees’ Provident Fund Organisation

న్యూఢిల్లీ: ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారినప్పుడు పీఎఫ్‌ ఖాతాలో డబ్బులు బదిలీ చేయాడానికి విత్‌డ్రా చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ పీఎప్‌ఓ ఈ సేవా పోర్టల్‌లో ఈ వివరాలను మార్చుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఉద్యోగులు తమ యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. మేనేజ్‌ టాబ్‌లోకి వెళ్లి మార్క్‌్‌ ఎగ్జిట్‌లోకి వెళ్లాలి. మీరు గతంలో పనిచేసిన సంస్థ నుంచి ఉద్యోగంలోంచి వైదొలిగిన తేదీ, కారణాన్ని అక్కడ తెలపాలి. ఆ తర్వాత ఓటీపీ కోసం రిక్వెస్ట్‌ పెట్టి..అనంతరం ఓటీపీని ఎంటర్‌ చేయాలి. చివర్లో ఆప్‌డేట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా ఈపీఎఫ్‌ఓ రికార్డుల్లో మీరు వైదొలిగిన కంపెనీ తేదీని నమోదు చేయొచ్చు. అయితే ఈ తేదీ నమోదు చేయాలంటే మీరు ఉద్యోగం నుంచి వైదొలిగి కనీసం రెండు నెలలు అయ్యి ఉండాలి. పాత కంపెనీ మీ పీఎఫ్‌ ఖాతాలో చివరిసారిగా జమ చేసి రెండు నెలలు దాటిన తర్వాతే ఈ మార్పులు చేసేందుకు వీలుంటుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/