ఒమిక్రాన్ గురించి అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న టాప్ సైంటిస్ట్

first-omicron-case-found-in-goa

ఒమిక్రాన్ వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ ఆఫ్రికా లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్..ఇప్పుడు అన్ని దేశాల్లోకి పాకింది. ఓ పక్క కరోనా ,మరోపక్క ఒమిక్రాన్ ఈ రెండు వైరస్ లకు ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ ల కారణంగా పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ గురించి అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ టాప్ సైంటిస్ట్ చెప్పడం ఇప్పుడు అందర్నీ సంతోషపరుస్తుంది.

టాప్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఫహీమ్ యూనస్ ఏమంటున్నాడంటే.. సౌతాఫ్రికాలోని ఆస్పత్రుల్లో ఒమిక్రాన్ బాధితులపై అధ్యయన వివరాలను విశ్లేషించారు. వివిధ అధ్యయనాలలోనూ ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని తేలిందన్నారు. అధ్యయనంలో భాగంగా 91 శాతం డెల్టా బాధితులతో పోలిస్తే.. ఒమిక్రాన్ బాధితుల్లో 31 శాతం మాత్రమే తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు ఉన్నాయని డేటాలో గుర్తించినట్టు తెలిపారు. డెల్టా రోగులలో 7 రోజులతో పోలిస్తే.. ఒమిక్రాన్ బాధితుల్లో ఆసుపత్రిలో చేరే వ్యవధి 3 రోజులకు తగ్గినట్టు అధ్యయన డేటాలో ఉందన్నారు.

పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఒమిక్రాన్‌పై అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయని యూనస్ చెప్పారు. ఒమిక్రాన్ బాధితుల్లో ఎక్కువగా చిన్న వయస్సు వారే ఉన్నారని తెలిపారు. వ్యాక్సినేషన్ కారణంగా ఈ వయస్సు వారిలో ఫలితాలు మెరుగ్గా ఉంటాయని తెలిపారు.

డెల్టా బాధితుల్లో 30 శాతం మంది ఐసియులో చేరగా.. ఒమిక్రాన్ బాధితుల్లో 18 శాతం మంది మాత్రమే ఐసియులో చేరినట్టు డాక్టర్ ఫహీమ్ పేర్కొన్నారు. డెల్టా సోకిన మొత్తం బాధితుల్లో 12 శాతం మంది వెంటిలేటర్‌పై ఉంటే.. ఒమిక్రాన్ బాధితుల్లో1.6 శాతం మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. డెల్టా బాధితుల్లో మరణాల రేటు 29 శాతం నమోదైంది. ఒమిక్రాన్ బాధితుల్లో మరణాల రేటు 3 శాతంగా ఉందన్నారు.