బాల్యమే భాగ్యం.. ఆటపాటలే ఆరోగ్యం

Childhood

ప్రకృతిలో ప్రతిది సహజంగానే జరిగి పోయే ఏర్పాటు సృష్టించబడింది. మానవ్ఞడు పుట్టడం, ప్రకృతితో కలిసి జీవించడం, సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. ‘ఆరోగ్యమే మానవాళికి మహా భాగ్యం చిన్నతనంలో ఉన్నంత ఉత్సాహం, కుతూహలం, పెద్ద వారిలో అంతగా కనిపించదు.ప్రతిజీవికి పుట్టుకతో వచ్చే సహజ లక్షణం స్వేచ్ఛ, చైతన్యం. ఇందులో ఏది తగ్గినా అసంపూర్ణ మైన జీవితమే. ప్రపంచవ్యాప్తంగా 146 దేశాలలో 11-17 ఏళ్ల వయస్సులో పిల్లల్లో 80శాతం కంటే ఎక్కువ మంది రోజుకు కనీసం గంటసేపు కూడా శారీరక వ్యాయామం చేయడం లేదు. దీని ఫలితంగా శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు పెరుగు తున్నాయి. మేధో వికాసం మందగిస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధకుల అధ్యయనం ఆందోళనకర విషయాలను వెలు వరించింది. ఆటపాటలతో హుషారుగా ఉండవలసిన బాల్యం స్తబ్ధంగా తయారవ్ఞతుందని, సెల్‌ఫోన్‌కు, టీవీకి, ట్యాబులకు దగ్గరవ్ఞతూ ఆటమైదానానికి, వ్యాయామానికి దూరమవ్ఞతుందని తేల్చేసింది. రోజుకు గంటపాటు శ్రమించేవారు 20శాతం కంటే తక్కువేనంటుంది. ఇలా పిల్లలకు ఎందుకు చెమట చుక్కలు రావడం లేదంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

తల్లిదండ్రు లు చదువ్ఞలు,ర్యాంకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇంటివద్ద సమయాన్ని మార్కుల వేటలో ట్యూషన్లకు కేటాయించడం వలన శారీరక శ్రమ జాడే లేకుండాపోతుంది. ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన బాల్యాన్ని అష్టకష్టాల పాల్జేసేది నిజం కాదా! తల్లిదండ్రులకు పిల్లల మీద బాధ్యత ఉండాలి. కానీ హక్కులు కాదు. ఇదిలావ్ఞంటే బడిలో ఆటల పీరియడ్‌ టైం టేబుల్‌లో ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆటలు ఆడించరు. మార్కు లు, గ్రేడులే లక్ష్యంగా స్పెషల్‌ క్లాసులతో కాలమంతా కరిగి పోతుంది. ప్రైవేట్‌, ప్రభుత్వ ఏ పాఠశాలలోనైనా ఆటస్థలం లేనే లేదు.నిబంధనలు తుంగలో తొక్కుతూ అనుమతులు ఇస్తూనే ఉన్నారు.వ్యాయామ ఉపాధ్యాయుడు అంతకాన్న లేడు.

సెల్‌ ఫోన్లు, కంప్యూటర్లు,ట్యాబులలో ఆటలకే పరిమితమైపోతున్నా రు. దీనివలన శారీరక దృఢత్వం, మేధస్సు వికసించడంలేదనే ఆలోచనల తల్లిదండ్రుల్లో,ఉపాధ్యాయుల్లో, పాలకుల్లో లేకుండా పోయింది. వ్యాయామమంటే?హృదయ స్పందన వేగాన్ని పెంచ డంతోపాటు, శ్వాసవేగాన్ని అధికంచేసే శారీరక కసరత్తు. నడక, పరుగు, సైక్లింగ్‌, ఈత, స్కిప్పింగ్‌, జిమ్నాస్టిక్‌లతోపాటు, క్రికెట్‌,ఫుట్‌బాల్‌ మరికొన్ని ఆటలు కూడా ఈ కోవలోకేవస్తాయి. మానసిక, శారీరక, ఆరోగ్యం కోసం యోగ, ఆసనాలు, ఆయా వయస్సులను బట్టిచేయడం మంచిది.పాఠశాల,కళాశాల స్థాయి లో కొన్నిచోట్ల చేస్తున్నారు.వ్యాయామం చేయడం వలన హృద యం, ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయి

.ఏముకలు,కండరాలు బలంగా తయారవ్ఞతాయి. దృఢంగా ఉండి, మానసికంగా, శారీ రకంగా ఆరోగ్యంగా ఉంటారు. అధిక బరువ్ఞ సమస్య ఉండదు. మధుమేహం, పక్షవాతం ముప్పు తగ్గుతుంది. చిన్ననాటి నుండి వ్యాయామ అలవాటు ఉండడం వలన వయస్సు పడ్డాక కూడా ఆరోగ్యంగా ఉంటారు. మనదేశంలో 72 శాతం మంది బాలురు రోజులో కనీసం గంటకూడా శారీరక శ్రమచేయడం లేదు. 5-17 సంవత్సరాల వయస్సుగలవారు ప్రతిరోజు కనీసం 60 నిమిషాలపాటు శారీరక శ్రమచేయాలి.ఈ వయస్సులో ఆటలు ఆడటం, పరుగెత్తడం, దూకడం వంటి వాటి వల్ల ఎముకలు దృఢంగా తయారవ్ఞతాయి.

పిల్లలు, యువకులు, శారీరక శ్రమ చేయడం లో కుటుంబం, పాఠశాల, సమాజ కార్యకలాపాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.వ్యాయామం చేయడం లింగం, జాతి లేదా ఆదాయ స్థాయిలతో సంబంధం లేకుండా అందరు పిల్లలు, యువతకు అవసరం. స్వీయ వ్యక్తీకరణ సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, సమైక్యతా భావంపెరిగి యువకుల సామాజిక అభివృద్ధికి తోడ్పడుతుంది. శారీరకంగా చురుకైన పిల్లలు, యువకులు వారి ఆహార అలవాట్లు నియంత్రించుకోగలరు. మంచి అలవాటు వైపు మొగ్గు చూపుతారు. అంతేకాదు అనారోగ్యకర అలవాట్ల జోలికి పోకుండా ఉంటారు.

  • మేకిరి దామోదర్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/