వాముతో ఆరోగ్యం

వంటింటి చిట్కాలు

Bishop’s Weed

వామాకుతో బజ్జీలు చేసుకుంటాము. వామాకుతో చేసే రసం, పెరుగు పచ్చడి రుచితో పాటు అనేక పోషకాలనిస్తుంది.

వాము మొక్కలను పెంచుతూనే ఆకులను నెలల తరబడి వాడుకోవచ్చు. కొత్త ఆకులను తెంపి వాడుకోవచ్చు.

వాము ఆకుల నుంచి వచ్చే సువాసనతో ఇంటి పరిసరాలు ఆహ్లాదకరంగా మారతాయి. దీన్ని మిగతా ఆకు కూరల మాదిరిగానే అన్ని వంటకాల్లో వాడుకోవచ్చు.

ప్రతి ఇంట్లో పోపుల పెట్టెలో ఉండే సుగంధ ద్రవ్యం వాము. దీని పుట్టిల్లు భారతదేశం.

రుచికి, శుచికి, ఆరోగ్యానికి వాము పెట్టింది పేరు. ఈ మొక్కలోని అన్ని భాగాలకు ఘాటైన వాసన ఉండటం వల్ల సంస్కృతంలో దీన్ని ‘ఉగ్రగంధ అంటారు.

వాములో పీచు, ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

దీన్ని పచ్చిగా, లేదా వేయించి కూడా వాడుకోవచ్చు. నీటిలో కలుపుకుని తాగవచ్చు. తేనీటిలో వేసుకుని తాగితే జలుబు, జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి.

వాము మొక్కలను పెరట్లో లేదా కుండీలలో పెంచుకుని తాజా ఆకులను వివిధ వంటకాల్లో వాడుకోవచ్చు.

వాము ఆకులను నీటిలో ఉడికించి తాగితే సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఈ ఆకులతో చేసిన పకోడీలు తినడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది.

పచ్చళ్లు, చట్నీలలో రుచి కోసం వాడుతారు. రంగు, రుచి కోసం పండ్ల రసాలు, పానీయాల్లో కూడా వాడుతుంటారు.

పొట్టలో సమస్యలను తగ్గించడానికి వాము, ఆకు ఉపయోగపడతాయి. ఇది ఆకలిని పెంచుతుంది. వాములో ఉండే థైమోల్‌ అనే రసాయనం శిలీంధ్రాలు, సూక్ష్మజీవులపై బాగా పనిచేస్తుంది.

నీళ్లలో కాస్త వాము వేసుకుని తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. కొవ్వును కరిగించి, బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. వెంట్రుకలు తెల్లబడకుండా చేసే శక్తి వాముకుంది.

గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసరైడ్‌ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తపోటును, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

వాములో కాస్త ఆవనూనె వేసి ఇంట్లో ఒక మూలన ఉంచితే దోమలు దరిచేరవు. వాములో ఉండే యాంటీ మయోటిక్‌, అనస్తిటిక్‌ విలువల వల్ల కాళ్ల నొప్పులు తగ్గుతాయి. పొట్టలో ఆమ్లతత్వాన్ని తగ్గిస్తుంది.

అందుకే చిన్న పిల్లలకు గ్యాస్‌, అజిర్తీ తగ్గించే సిరప్‌లలో వాము నీటిని ఎక్కువగా వాడతారు. వామును విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు.

కంపోస్టు, కొబ్బరి పీచు మిశ్రమాన్ని ట్రేలో గానీ, సిమెంట్‌ తొట్టిలో గాని నింపి అందులో పైపైన వాము గింజలు చల్లాలి. ఆ తర్వాత పైన పల్చగా మట్టిని వేయాలి. నీడ ప్రదేశంలో ఉంచి ఉదయం, సాయంత్రం నీటిని తుంపరలుగా చల్లాలి.

వారం నుండు రెండు వారాల్లో మొలకెత్తుతాయి. సూర్యరశ్మి ఎక్కువగా అవసరం లేదు. కొద్దిగా ఎండపడే ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలి. ఆ

కులు ఎండిపోతే తెంపి పారేయాలి. పురుగులు పడితే వేపనూనె పిచికారీ చేయాలి. తొట్టిలోని మట్టి తడి ఆరకుండా చూసుకోవాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/