దుర్గమ్మ ఆలయంలో బంగారం చోరీకి యత్నం

indrakeeladri
indrakeeladri

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దోపిడికి ప్రయత్నించిన దంపతులు ఆలయ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. హుండీ లెక్కింపులో సింహాచలం అనే వ్యక్తి పాల్గొన్నాడు. అమ్మవారికి కానుకగా వచ్చిన వాటిలో కాసున్నర బంగారాన్ని పక్కకు తీసిన సింహాచలం తన లుంగీలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆలయంలోనే స్వీపర్‌గా పనిచేస్తున్న తన భార్యకు ఆ బంగారాన్ని ఇస్తుండగా ఆలయ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/