పసిడి ధరలు పైపైకి!

gold
gold

న్యూఢిల్లీ: ప్రపంచమార్కెట్లోపసిడి ధర సోమవారం 5 డాలర్లు పెరిగింది. ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత ఇందుకు కారణమయ్యాయి. అమెరికా-చైనాల మధ్య ఈ గురు, శుక్ర వారాల్లో ఉన్నతస్థాయి చర్చలు జరగనున్నాయి. ఏడాదిన్నర కాలంగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య వివాదం కారణంగా ఇరు దేశాల ఆర్థికవ్యవస్థ కుంటుపడటంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా కదులుతోంది. అయితే, అమెరికా ప్రతిపాదనలకు చైనా ఒప్పుకోకపోవచ్చనే సమాచారంతో నేడు ఆసియీ ఈక్విటీ మార్కెట్లు ట్రేడవుతున్నాయి. మరోవైపు పసిడిపై ప్రభావాన్ని చూపే డాలర్‌ ఇండెక్స్‌ ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో బలహీనంగా ట్రేడవుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ పెరగడంతో నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర క్రితం వారం ముగింపుతో పోలిస్తే 5 డాలర్లు పెరిగి 1,518డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగా పసిడి ధర లాభాల్లో ట్రేడవుతోంది. ఎంసిఎక్స్‌లో డిసెంబరు కాంట్రాక్టు 10 గ్రాముల బంగారం ధర రూ.77.00లాభంతో రూ.38,409వద్ద కదలాడుతోంది. ఫోరెక్స్‌ మార్కెట్లో డాలరు మారకంలోరూపాయి విలువ బలహీనపడడం బంగారానికి కలిసొస్తుంది. స్వల్పకాలంలో పసిడి ఫ్యూచర్లు పెరిగేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పసిడి ర్యాతీ కొనసాగితే 38,900స్థాయి నిరోధాన్ని, పతనమైతే రూ.37,775వద్ద మద్దతు స్థాయిని పరీక్షించవచ్చని వారు అంటున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/