భారీగా పెరిగిన బంగారం ధరలు

రెండు రోజుల్లోనే రూ.1,800 పెరుగుదల

Gold
Gold

న్యూఢిల్లీ: అమెరికా -ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే 10 గ్రాముల పసిడి ఏకంగా రూ.1,800 పెరిగింది. ఎంసిఎక్స్‌ లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్‌లో 10 గ్రాములు 2.3 శాతం (రూ.918) పెరిగి రూ.41,030కి చేరుకుంది. శుక్రవారం 2 శాతం (రూ.850) పెరిగింది. దీంతో ఈ రెండు రోజుల్లోనే ఏకంగా రూ.1,800 వరకు పెరిగింది. మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఎంసిఎక్స్‌ లో కిలో వెండి 2 శాతం (రూ.947) పెరిగి రూ.48,474కు చేరుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం రూ.72 దాటింది. ఈ ప్రభావం బంగారంపై పడింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. బంగారం ధర ఈ రోజు రూ.41,300కు, వెండి ధర కిలో రూ.48,900కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/