పసిడి పతనం ఇంకో వారం కూడా కొనసాగవచ్చు!

gold price
gold price

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడటం, స్థానిక నగల వ్యాపారుల నుండి డిమాండ్‌ తగ్గటంతో వచ్చే వారం కూడా బంగారం ధరల పతనం కొనసాగవచ్చని సమాచారం. కాగా వెండి నాణేల తయారుదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి వెండి కొనుగోళ్లు తగ్గటంతో వెండి ధరలు కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని సమాచారం. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడుతుండటం, అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ ప్రతికూలంగా ఉండటం లాంటి కారణాల వల్ల బంగారం ధరలు తగ్గవచ్చని వర్తకులు అంటున్నారు.వారం చివరినాటికి దేశ రాజధాని
ఢిల్లీ లో 99గ్రాములు బంగారం ధర రూ.33,170 వద్ద ఉంది.


మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/