దిగోస్తున్న బంగారం ధర

gold
gold

ముంబయి: పండుగ సీజన్‌కు ముందు బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర ఒక్క రోజే రూ.1580 తగ్గింది. బులియన్ మార్కెట్లో పసిడి 10 గ్రాములకి రూ.497 తగ్గి 38,685 రూపాయలకు చేరుకుంది. వెండి ధర కూడా రూ .1,580 తగ్గి కిలో రేటు 47,235 రూపాయలకు పడిపోయింది. అంతర్జాతీయంగా న్యూయార్క్‌లో బంగారం ఔన్సు 1,508 డాలర్లు, వెండి న్యూయార్క్‌లో ఔన్సు 17.90 డాలర్లకు పడిపోయింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు ముమ్మరం కావడంతో బంగారానికి డిమాండ్ తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. చైనా అధ్యక్షుడితో వాణిజ్య యుద్ధాన్ని ఊహించిన దానికంటే ముందే పరిష్కరించుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ చేసిన ప్రకటనతో బంగారం ఒత్తిడిలో ఉందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/