మళ్లీ రూ.50వేలు దాటిన పసిడి ధరలు
ఎంసిఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.106.00 పెరిగి రూ.50,145.00వద్ద ట్రేడయింది.

ముంబై: బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ప్రారంభంలో తగ్గిన ధరలు, ఆ తర్వాత స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు క్లోజింగ్ సమయానికి ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.22 పెరిగి రూ.50,035వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ మాత్రం రూ.2 క్షీణించి రూ.50,099వద్ద ముగిసింది.
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.777పెరిగి రూ.68040వద్ద, మే ఫ్యూచర్స్ రూ.677 లాభపడి రూ.69115వద్ద ముగిసింది.
బుధవారం మరో వంద వరకు పెరిగింది. ఆల్‌టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.6000తక్కువగా ఉంది. బుధవారం ఎంసిఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.106.00పెరిగి రూ.50,145.00వద్ద ట్రేడయింది. రూ.50,179వద్ద ప్రారంభమైన ధర, రూ.50,179వద్ద గరిష్టానికి, రూ.50,106వద్ద కనిష్టానికి చేరింది. పసిడి రూ.50వేల పైకి చేరుకుంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.6000 తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.41క్షీణించి రూ.50,170వద్ద ట్రేడయింది. రూ.50,218వద్ద ప్రారంభమై, రూ.50,218వద్ద గరిష్టానికి, రూ.50,170వద్ద కనిష్టానికిచేరింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 724 తగ్గి రూ.68,821వద్ద ట్రేడయింది. రూ.68,500 వద్ద ప్రారంభమై రూ.68,999వద్ద గరిష్టానికి, రూ.68,500వద్ద కనిష్టానికి చేరింది.
గత వారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518వద్ద క్లోజ్ అయింది. మే ఫ్యూచర్స్ 666.00పెరిగి రూ.69,796వద్ద ట్రేడయింది. రూ.69,743వద్ద ప్రారంభమై రూ.69,800వద్ద గరిష్టానికి, రూ.69,700వద్ద కనిష్టానికి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల గోల్డ్ ఫ్యూచర్స్ 1900 డాలర్ల దిశగా సాగుతోంది. పసిడి బుధవారం స్వల్పంగా పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 6.25 డాలర్లు పెరిగి 1889.15డాలర్ల వద్ద ట్రేడయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం క్షీణించింది. ఔన్స్ ధర 0.393డాలర్లు పెరిగి 26.610డాలర్ల వద్ద ట్రేడయింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/