రూ. 55,300కు చేరిన పసిడి ధర

రూ. 72,854కు కిలో వెండి ధర

gold

ముంబయి: పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. అక్టోబర్ ఫ్యూచర్స్ మార్కెట్ లో 10 గ్రాముల పసిడి ధర రూ. 202 పెరిగి రూ. 55,300కు చేరింది. దీంతో స్పాట్ మార్కెట్లో ధరలు మరింతగా పెరుగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో వెండి ధర కిలోకు రూ. 691 పెరిగి రూ. 72,584కు చేరింది. రెండు రోజుల క్రితం రూ. 4 వేలు పెరిగి, ఆల్ టైమ్ రికార్డుగా రూ. 76 వేల మార్క్ ను దాటేసిన వెండి ధర, బుధవారం అంతే మొత్తం తగ్గింది. వెండి ధర మరోమారు రికార్డు స్థాయులను దాటుతాయని భావిస్తున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఆరోరోజూ ధరలు పెరిగాయి. న్యూయార్క్ లో ఔన్సు బంగారం ధర 0.6 శాతం పెరిగి 2,081 డాలర్లను దాటింది. వెండి ధర ఏకంగా 2.5 శాతం పెరిగి 29.12 డాలర్లకు చేరుకుంది. 2013 తరువాత వెండి ధర ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/