తగ్గిన బంగారం ధరలు!

Gold
Gold

న్యూఢిల్లీ: మొత్తంగా గత వారంలో మాత్రం బంగారం ధర తగ్గింది. అదే సమయంలో వెండి ధర మాత్రం పెరిగింది. వారం ప్రాతిపదికన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర భారీగా పడిపోగా, 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా క్షీణించింది. వెండి ధర పెరిగింది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో గతవారం ప్రారంభంలో తగ్గింది. వారాంతంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరగడంతో పాటు దేశీయ మార్కెట్ జ్యువెల్లర్స్ నుంచి కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరిగింది. దీంతో ధర పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా ఓ కారణం. గతవారం ప్రారంభంలో అంటే సోమవారం 24 క్యారెట్ల బంగారం రూ.42,050గా ఉండగా, శనివారం నాటికి రూ.41,050కి దిగి వచ్చింది. అంటే రూ.వెయ్యి తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.38,200 నుంచి రూ.38,100కు దిగి వచ్చింది. వెండి ధర రూ.49,150 నుంచి రూ.49,400కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ 21.28 డాలర్లు పెరిగిందని, దీంతో 1,605 డాలర్లకు చేరుకొని జీవనకాల గరిష్టానికి చేరుకుందని, రాబోవు రోజుల్లోను ధరలు పెరగవచ్చునని చెబుతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/