రూ. 50 వేలకు చేరిన పుత్తడి ధర

gold
gold

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు ఈరోజు ఆల్‌టైం రికార్డు సృష్టించాయి. తొలిసారిగా పదిగ్రాముల బంగారం రూ.50 వేల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 1 శాతం మేర పెరిగి తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం రూ.50,060కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా 6 శాతం మేర పెరిగి రూ.60,782కి చేరాయి. గత ఏడున్నరేళ్లలో ఇది అత్యధిక పెరుగుదల కావడం విశేషం. మార్కెట్లో ఇదే ఒరవడి కొనసాగితే మరో మూడు నెలల్లో బంగారం పదిగ్రాములు రూ.55 వేలకు, కిలో వెండి రూ.70 వేలకు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా బంగారానికి ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ… ధరల కారణంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో రిటైల్ డిమాండ్ మాత్రం భారీగా పడిపోవడం గమనార్హం.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/