వరుసగా రెండో రోజూ పసిడి రికార్డు ధర

రూ. 48,829కి పది గ్రాముల ధర

gold
gold

ముంబయి: భారత్‌లో బంగారం ధర ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. బుధవారం నాటి మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 48,829కి చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది రూ. 67 అధికం. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలో కొత్త రికార్డు నమోదైనట్లయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 8 సంవత్సరాల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలోనే ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. సమీప భవిష్యత్తులో బంగారం ధర రూ. 49 వేలను దాటి ముందుకు సాగుతుందని వెల్లడించారు. కాగా, ఔన్సు బంగారం ధర ఈ ఉదయం ఆసియా మార్కెట్లో 1,801 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/