పండుగలతో పసిడికి పెరుగుతున్న సీజన్‌!

gold
gold


బెంగళూరు : భారత్‌ బంగారం కొనుగోళ్లకు డిమాండ్‌క్రమేపీ పెరుగుతూ వస్తోంది. పండుగలు, శుభకార్యాల వేడుకల సీజన్‌పై పెరుగుతుండటంతో బంగారానికి డిమాండ్‌ పెరుగుతున్నదని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో చైనా తర్వాత అతిపెద్ద పసిడి వినియోగదేశంగా ఉన్న భారత్‌లో బుధవారం నాటికి పసిడి మార్కెట్‌ ధరలు 39,885 రూపాయలకు చేరింది. వారాంతంలో 372 రూపాయలు తగ్గింది. శుక్రవారం రేట్లను పరిశీలిస్తే 38,504 రూపాయలకు తగ్గింది. ఒకదశలో బుధవారం ధరలే గరిష్టస్థాయిలో ఉన్నాయనిపిస్తోంది.

బహుళజాతి బులియన్‌ సంస్థ చెన్నైడీలర్‌ ఒకరు మాట్లాడుతూ డిమాండ్‌ క్రమేపీ మెరుగుపడుతున్నదని వెల్లడించారు. డీలర్లు ఔన్స్‌కు 45 డాలర్లు చొప్పున డిస్కౌంట్లు ఆఫర్‌చేస్తున్నారు. అధికారికంగా దేశీయ ధరలపైనే ఈ వారంలో మంచి ఆఫర్లు వచ్చాయి. గతవారంలో డిస్కౌంట్లు ఔన్స్‌ ఒక్కింటికి 24 డాలర్లవరకూ ఆఫర్‌ వచ్చింది. దేశీయంగా 12.5శాతం దిగుమతిసుంకం, మూడుశాతం అమ్మకపు పన్నును కలిపి ధరలు వసూలు చేస్తారు. ముంబయి కేంద్రంగా ఉన్న ఒక డీలర్‌ మాట్లాడుతూ రానున్న సీజన్‌ను ముందుగానే అంచనావేసికానీ ఆభరణాల వ్యాపారులు కొనుగోళ్లు ప్రారంభించరని, ఒక ప్రైవేటు బులియన్‌ దిగుమతి బ్యాంక్‌ డీలర్‌ వెల్లడించారు.

ఇప్పటివరకూ జ్యూయెలర్ల వద్ద తక్కువ నిల్వలు మాత్రమే ఉన్నాయి. సీజన్‌ పెరుగుతూ వస్తున్నందున స్టాక్స్‌ను పెంచుకోవాల్సి ఉంటుందని డీలర్‌ వెల్లడించారు. డిమాండ్‌ సహజంగా భారత్‌లోనాలుగోత్రైమాసికంలో పెరుగుతుంది. పెళ్ళిళ్లు శుభకార్యాల సీజన్‌ అప్పుడేప్రారంభం అవుతుంది. దీపావళి, దసరా వంటిస ఈజన్లు అప్పుడే ప్రారంభం అవుతాయి. భారత్‌ ఆగస్టునెల దిగుమతులనుపరిశీలిస్తే 73శాతం దిగజారాయి. ఏటికేడాది చొప్పున చూస్తే ధరలు ర్యాలీతీసాయి. దిగుమతి సుంకం పెంచడం, జిఎస్‌టి 3శాతం వంటివి కొంత దిగుమతులకు, కొనుగోళ్లకు విఘాతం కలిగించాయనే చెప్పాలి. అంతర్జాతీయంగా బెంచ్‌మార్క్‌ స్పాట్‌గోల్డ్‌ ధరలు వారంమొత్తం క్షీణదశలోనే ఉనానయి. ఇప్పటికీ ఔన్స్‌ బంగారంధరలు 1500డాలర్లుగానే ఉన్నాయి. వారం ప్రారంభంలో 1557 డాలర్లకుసైతం నడిచాయి. 2013 ఏప్రిల్‌ నెల తర్వాత అత్యంత ఖరీదైన వస్తువుగా బంగారం మారినసంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారంకొనేదేశంగా ఉన్న చైనాలో బంగారానిన ఔన్స్‌కు ప్రీమియం ధరలకు విక్రయిస్తోంది. తొమ్మిదినుంచి పదిడాలర్లుప్రీమియం ధరలకు అమ్మకాలుజరుగుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/