మేయర్‌ వద్ద 13వేల కిలోల బంగారాన్ని గుర్తించిన అధికారులు

gold
gold

బీజింగ్‌: చైనా హైనాన్‌ ప్రావిన్స్‌ రాజధాని హైకౌర్‌లో మేయర్‌ స్థానంలో ఉన్న జాన్‌క్వీ వద్ద వేల కిలోల బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతని వద్ద ఉన్న మొత్తం సొమ్ము ఒక దగ్గర వేస్తే దాదాపు మన తెలుగు రాష్ట్రాల బడ్జెట్‌తో సమానమని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. జాన్‌క్వీ వద్ద దాదాపు 13,300 కిలోల బంగారం ఉన్నట్లు చైనా అధికారులు స్పష్టం చేవారు. ఈ బంగారం విలువల రూ.2.68 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. జాన్‌క్వీ ఇంట్లో సోదాలు నిర్వహించగా పెద్ద పెద్ద ర్యాకుల్లో, ప్లాస్టిక్‌ సంచుల్లో బంగారు కడ్డీలు మూటలు కట్టి ఉన్నాయని, బంగారు ఇటుకలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ బంగారాన్ని, నగదును కేవలం లంచాల ద్వారానే సంపాదించినట్లు గుర్తించారు. ఇవే కాకుండా విలాసవంతమైన విల్లాలు లంచంగా పుచ్చుకున్నాడని కూడా వారు తెలిపారు. అతడిపై ఉన్న ఆరోపణలు రుజువైతే చైనాకు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం అలీబాబా వెబ్‌సైట్‌ అధినేత జాక్‌మా ఆస్తుల కంటే జాన్‌క్వీ సంపదే ఎక్కువగా ఉంటుదని అధికారులు అంటున్నారు.
తాజా అంతర్జాతీయ వార్త కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/