రూ.40 వేలు దాటిన పుత్తడి.. 40,220

gold
gold

న్యూఢిల్లీ: గత కోంతకాలంగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తారస్థాయిలో పెరిగిపోతున్నాయి. నేటి మార్కెట్లో ఏకంగా రూ. 40వేల మార్క్‌ను దాటి సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. గురువారం ఒక్కరోజే రూ. 250 పెరగడంతో బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ. 40,220 పలికింది. అటు వెండి ధర కూడా రూ. 50వేల మార్క్‌ను సమీపిస్తోంది. నేడు రూ. 200 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 49,050కి చేరింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/