పండగ వేళ స్వల్పంగా పెరిగిన బంగారం ధర

India ranks first in gold consumption
India ranks first in gold consumption

దేశ వ్యాప్తంగా దసరా సంబరాలు మొదలయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుండి బతుకమ్మ సంబరాల్లో ఆడపడుచులు మునిగిపోయారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. బంగారం తో పాటు వెండి కూడా ధరల్లో పరుగులు తీస్తుంది.

హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి.. రూ.48,270వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.290 పెరిగి రూ.62,599గా ఉంది.

విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.48,270గా ఉంది. కిలో వెండి ధర రూ.62,599 వద్ద కొనసాగుతోంది.

వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,270గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,599 వద్ద కొనసాగుతోంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,920గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,910గా ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,680గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,680గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,910గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,700గా ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,560గా ఉంది.