తనపై అసత్య ఆరోపణలు చేస్తే పరువునష్టం దావా వేస్త

TRS Working President KTR
TRS Working President KTR

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు పద్దతి మార్చుకోకపోతే పరువు నష్టందావా వేయనున్నట్లు కెటిఆర్‌ తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తాను చెప్పినట్లు తెలిపారు. విద్యార్థులు తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని సిఎం కెసిఆర్‌ చెప్పారన్నారు. రూ. 4 కోట్ల 35 లక్షల 70 వేలకు గ్లోబరీనాకు టెండర్ దక్కింది. ఒకాయన 10 వేల కోట్ల స్కాం జరిగిందని అంటున్నడన్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. కేసీఆర్‌ను ఎవరైనా ఏమైనా అంటే కొన్ని మీడియాలు కత్తులు దూసేందుకు రెడీగా ఉంటాయన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్యపడవద్దని.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని కేటీఆర్ వెల్లడించారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/