ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాదం హెచ్చరిక జారీ

ప్రమాదకర స్థితికి చేరుకున్న గోదావరి

dowleswaram

రాజమండ్రి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి పొంగి ప్రవహిస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడక్కడ ఔట్ ఫ్లో 9.84 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. గోదావరి ప్రవాహ తీవ్రత అంతకంతకు అధికమవుతుండడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధం తెగిపోయింది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం కాజ్ వే మునిగిపోవడంతో సమీప లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఎగువన ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. ప్రస్తుతం అక్కడ 45 అడుగులు ఉన్న నీటిమట్టం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/

Suma Latha

Recent Posts

ప‌ల్లె, పట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌పై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్య క్రమాలపై సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్‌లో మంత్రులు, ప్రభుత్వ…

1 hour ago

షీనా బోరా హత్య కేసు..ఇంద్రాణి ముఖర్జియాకు బెయిల్ మంజూరు

పీటర్ ముఖర్జియాకు విధించిన షరతులే ఆమెకు కూడా వర్తిస్తాయన్న సుప్రీం sc-grants-bail-to-indrani-mukerjea-in-sheena-bora-murder-case న్యూఢిల్లీ : షీనా బోరా హత్య కేసు…

1 hour ago

వనజీవి రామయ్యకు ప్రమాదం..అండగా ఉంటామని హరీష్ రావు హామీ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్యకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ప్రముఖ పర్యావరణ…

1 hour ago

ప్రాంతీయ పార్టీలే మెరుగైన పాలన అందిస్తున్నాయి : కవిత

తమది ప్రజల ఎజెండా అన్నటీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత kavitha హైదరాబాద్ : రాబోయే కాలంలో కేంద్రాన్ని ఏలేది ప్రాంతీయ పార్టీలేనని…

2 hours ago

బీరు ప్రియులకు జేబుకు చిల్లు అయ్యే వార్త

ఎండలు దంచికొడుతున్నాయి..బయట కాలు పెట్టాలంటే వణిపోతున్నారు.ఇక మందు బాబులైతే ఈ ఎండ తీవ్రత నుండి బయటపడేందుకు బీర్లను తెగ తాగేస్తున్నారు.…

2 hours ago

మంత్రి నిరంజన్ రెడ్డిపై ష‌ర్మిల విమ‌ర్శ‌లు

పంట లేటుగా వేస్తే, గాలి వాన వస్తే సీఎం ఆపుతాడా?కొనం కొనం అని చివరకు కొంటానన్న సన్నాసులు ఎవర‌ని నిల‌దీత‌…

2 hours ago