భద్రాచలం గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

మరోసారి భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. ఎగువున కురుస్తున్న వర్షాలకు తోడు..తెలంగాణ లో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండడంతో గోదావరికి వరద పెరుగుతూ వస్తుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు వరకు గోదావరిలో నీటిమట్టం 43 అడుగలకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మరోపక్క ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అధికారులను సన్నద్ధంగా ఉంచాలన్నారు. సచివాలయంలో తక్షణమే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇక ములుగు జిల్లా వాడేజు వద్ద గోదావరిలో నీటిమట్టం పెరుగడంతో టేకులగూడెం వద్ద హైదరాబాద్‌ – భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.