గాడ్ ఫాదర్ నుండి నజభజ సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ నుండి మరో సాంగ్ నజభజ రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో గాడ్ ఫాదర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే , ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు. రీసెంట్ గా ‘థార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సహం నింపిన మేకర్స్..తాజాగా మంగళవారం మరో సాంగ్ రిలీజ్ చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు.

‘నజభజనజరా.. నజభజనజరా… గజగజ వణికించే గజరాజడిగోరా.. భుజములు జులిపించే మొనగాడడిగోరా..’ అంటూ సాగే గీతం ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది. ‘అడవి తల్లికి అన్నయ్య వీడురా.. కలబడితే కథకలిరా..’ అంటూ గాడ్ ఫాదర్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే సాహిత్యం అందించారు గీత రచయిత అనంత్ శ్రీరామ్. యువ సంగీత గాయకులూ శ్రీ కృష్ణుడు మరియు పృధ్వీ చంద్ర కలిసి తమ గాత్రంతో ఈ పాటకు మరింత ప్రాణం పోశారు. మరి ఈ సాంగ్ థియేటర్స్ లలో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉంటె ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 28న అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నారట. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ను చిరంజీవి వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు సమాచారం. అందుకు సల్మాన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో కనిపించడంతో పాటు చిన్న పాత్రలో సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ లో భాయ్-చిరు ఎలా కనిపించనున్నారు అన్నది రివీల్ చేసారు. ఈనేపథ్యంలో ఇద్దరు ఒకే వేదికపై కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతుంది.

YouTube video