గాడ్ ఫాదర్ మూవీ టాక్

God father movie Talk

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ఈరోజు దసరా సందర్బంగా గ్రాండ్ గా విడుదలైంది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. RB చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించగా , థమన్ మ్యూజిక్ అందించారు.

పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న ఓ ఫ్యామిలీ పెద్ద, రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత ఆ బాధ్యతలు కొడుకుకు అప్పగిస్తారు. అతడికి సమస్యలు వచ్చిన సమయంలో హీరో పాత్ర ఎంట్రీ ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. అసలు ఆ కుటుంబానికి, హీరోకు సంబంధం ఏంటి? హీరోకు మాఫియా డాన్‌ ఎలా పరిచయం ఏర్పడింది? అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఆచార్య మూవీ ప్లాప్ కావడంతో మెగా అభిమానులు గాడ్ ఫాదర్ మూవీ ఫై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల షోస్ పూర్తి కావడం తో సినిమా టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసిన వారంతా తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

‘గాడ్ ఫాదర్’ మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ మోహన్ రాజా చాలా తక్కువ సమయమే తీసుకున్నాడట. చిరంజీవి సూపర్బ్ ఎంట్రీ, ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ ట్విస్ట్‌తో ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని , సెకెండాఫ్ కూడా బాగున్నప్పటికీ సల్మాన్ ఖాన్ ఎంట్రీ తర్వాత కథ కాస్త గాడితప్పినట్లు అనిపించిందని అంటున్నారు. చిరంజీవి వన్ మ్యాన్ షో చేశారట. అలాగే, కథ, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, పవర్‌ఫుల్ పొలిటికల్ డైలాగ్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని అంటున్నారు. అయితే, కామెడీ లేకపోవడం, కొంత ల్యాగ్ అనిపించడం ఈ సినిమాకు మైనస్ అని అంటున్నారు.