గాడ్ ఫాదర్ గురించి ఒక్కమాటలో చెప్పిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 05 న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి పటాస్ యాంకర్ శ్రీముఖికి ఓ చార్టర్డ్ ప్లేన్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనికి సంబదించిన వీడియో ను విడుదల చేసి ఆకట్టుకున్నారు.

గాడ్ ఫాదర్ చిత్రం ఎలా ఉంటుందో ఒక్క మాటలో చెప్పమంటే.. సరిగ్గా చెప్పాలంటే గాడ్ ఫాదర్ ఒక నిశ్శబ్ద విస్ఫోటనం అని మెగాస్టార్ అభివర్ణించారు. హీరోయిన్లు లేరేంటి, పాటలు లేవేంటి? అనే ఆలోచనే రానివ్వని సబ్జెక్ట్ గాడ్ ఫాదర్ అని అన్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎంతో ప్రేమతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాడని, హ్యాట్సాఫ్ టు సల్మాన్ భాయ్… వుయ్ లవ్యూ అని మెగాస్టార్ తన ప్రేమను వ్యక్తం చేసారు. అలాగే ఈ మూవీ లో జర్నలిస్టు పాత్ర చేసేందుకు దర్శకుడు పూరీ జగన్నాథ్ మొదట అంగీకరించలేదని చిరంజీవి వెల్లడించారు. ఈ సినిమా చూసి తర్వాత పూరీలో సాధికారత ఉన్న నటుడు ఉన్నాడని మీరే ఆశ్చర్యపోతారు అని తెలిపారు.

ఈ సినిమాకు ఆరో ప్రాణమై, 100 శాతం కంటే ఇంకా ఎక్కువకు తీసుకెళ్లిన వ్యక్తి సంగీత దర్శకుడు తమన్ అని కితాబునిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ ప్రోమో ఫై లుక్ వెయ్యండి. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ రీమెక్ ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా మోహన్ రాజా తెరకెక్కించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మెగా సూపర్ గుడ్ ఫిలిం వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

YouTube video