రేపు గోవా అసెంబ్లీలో బల పరీక్ష..

pramod sawant
pramod sawant


పనాజీ: గోవా అసెంబ్లీలో రేపు బలపరీక్ష ఉంటుందని ఆ రాష్ట్ర సియం ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. సియంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మనోహర్‌ పారికర్‌ మృతి నేపథ్యంలో ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించామని, ఇది పూర్తయ్యే వరకు తనకెవరూ శుభాకాంక్షలు చెప్పొద్దని, పూలతో స్వాగతించొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అని సావంత్‌ పేర్కొన్నారు. డిప్యూటి సియంలుగా విజ§్‌ు సర్ధేశా§్‌ు, సుదిన్‌ దవలికర్‌లు కొనసాగుతున్నారని ఆయన చెప్పారు.
పారికర్‌ మృతితో గోవాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కాంగ్రెస్‌ను ఆహ్వానించాలంటూ గవర్నర్‌ మృదుల సిన్హాకు ఆ పారీ నాయకులు లేఖ అందించారు. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ లేఖలో పేర్కొంది. 40 స్థానాలున్న గోవాలో ప్రస్తుతం 36 మంది సభ్యులున్నారు. వారిలో కాంగ్రెస్‌ 14 మంది, బిజెపి 12 మంది, మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ, గోవా ఫార్వర్డ్‌ పార్టీలకు చెరో మూడు స్థానాలున్నాయి. ఈ ఆరుగురు సభ్యులతో పాటు మరో ముగ్గురు స్వతంత్య్ర అభ్యర్ధులు కూడా బిజెపికి మద్దతు ఇస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/