కలస, బందూరి ప్రాజెక్టుకు వ్యతిరేకం

pramod sawant
pramod sawant

పనాజీ: కర్నాటకలోని బెళగావి, ధర్వాడ్‌, గడగ్‌ జిల్లాలో తాగునీటి సమస్యను తీర్చటానికి కర్ణాటక ప్రభుత్వం కలస, బందూరి ప్రాజెక్టును చేపడుతోంది. అయితే ఈ ప్రాజెక్టు అనుమతులు కోసం కేంద్ర వాతావరణ, అటవీ, పర్యావరణ అనుమతులు సంబందించిన కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను సంప్రదించింది. దీనికి ప్రకాశ్‌ జవదేకర్‌ సానుకులంగా స్పందించాడు. కర్ణటకలో బిజెపి ప్రభుత్వం అధికారం ఉండటం వల్ల అనుమతులు మంజూరు విషయంలో సానుకులంగా ఉండి సమ్మతి పత్రం ఇచ్చారు. దీనికి గోవా సిఎం ప్రమోద్‌ సావంత్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. కలస,బందూరి ప్రాజెక్టు కారణంగా అటవీసంపద, జంతువులకు మరియు పర్యావరణం తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణ ప్రేమికులు, జంతు ప్రేమికులు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కలస, బందూరి ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా అనుమతులు మంజూరు చేయలేదని కాని సమ్మతి లేఖ ఇవ్వడమంటే దాదాపూ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినట్టే అని గోవా సిఎం అన్నారు. ఈ విషయంలో కేంద్రమంత్రి జవదేకర్‌ నిర్ణయం తీసుకొకపోతే ప్రధాని మోడి ని కలుస్తానని కలస బందూరి ప్రాజెక్టు వల్ల కలిగే నష్టాలు వివరిస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కేంద్రమంత్రి మమ్మల్ని సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకులేరనీ గోవా సిఎం అన్నారు. మరోవైపు కర్ణాటక యడ్డీ ప్రభుత్వం తాగునీటీ కోసం చేపట్టే ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా నిర్మించి తీరాతామని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/