గో ఎయిర్ ఉద్యోగులకు వేతనం లేని సెలవులు
లాక్‌డౌన్ నేపథ్యంలో సెలవులు తీసుకోమన్నామన్న సంస్థ

ముంబయి: లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రైవేటు రంగ విమానయాన సంస్థ గోయిర్ తమ ఉద్యోగుల్లో అత్యధికశాతం మందికి వేతనం లేని సెలవులు ఇచ్చింది. లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గో ఎయిర్ ప్రకటించింది. లాక్‌డౌన్ పొడిగించడంతో విమాన సర్వీసులన్నీ నిలిచిపోయాయని ఈ నేపథ్యంలో తమకున్న 5,500 మంది సిబ్బందిలో అత్యధిక శాతం మందిని మే 3 వరకు వేతనం లేని సెలవుల్లో (ఎల్‌డబ్యూపీ) ఉండమని చెప్పినట్టు తెలిపింది. గత నెలలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పుడే వేతనం లేని సెలవులను రొటేషన్ పద్ధతిలో ఉపయోగించుకోమని సిబ్బందికి చెప్పామని సంస్థ తెలిపింది. మరోవైపు, కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ మొత్తం సిబ్బందిలో పదిశాతం మంది విధులకు హాజరవుతారని, విమానాలు నడవనప్పటికీ వీరి సేవలు అత్యవసరమని పేర్కొంది. వీరికి పాక్షికంగా వేతనం చెల్లిస్తామని వివరించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/