వికేంద్రీకరణ నివేదికపై జీఎన్‌రావు స్పందన

GN Rao Committee
GN Rao Committee

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సమగ్రాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణపై నివేదిక ఇచ్చిన జీఎన్ రావు మీడియాతో మాట్లాడారు. మా సిఫారసుల్లో కీలకమైనది రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కొనసాగిస్తూ.. దాంతోపాటు ప్రభుత్వ వికేంద్రీకరణ మోడల్ ఉండాలని సూచించామన్నారు. 13 జిల్లాల్లో( జోన్ 1,2,3,4) ప్రాంతీయ అసమానతలను తొలగింపు, అభివృద్ధి ప్రక్రియలో ఎదురయ్యే నిరోధకాలను దృష్టిలో పెట్టుకుని తమ సిఫారసులు చేశామని జీఎన్ రావు అన్నారు. విశాఖ, మచిలీపట్నం, విజయవాడలో అభివృద్ధి, అటంకాలను కమిటీ చర్చించామన్నారు. చుట్టుపక్కల జిల్లాల అభివృద్ధి, వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చేయాలని తాము సూచించామని చెప్పారు. విశాఖ మెట్రోపాలిటన్ ఉత్తర ప్రాంతంలో సెక్రటేరియట్ నిర్మించాలని పేర్కొన్నామని అన్నారు. విశాఖలో వాతావరణం భాగుండదని మీడియా ప్రతినిధి వ్యాఖ్యకు రావు సమాధానమిస్తూ.. విశాఖకు దూరంగా నిర్మించాలని సూచించామని అన్నారు. తుపాన్లు ఎక్కడైనా రావచ్చని వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/