భారత్‌ అమ్మాయితో మ్యాక్స్‌వెల్‌ ప్రేమ

Maxwell with Indian Girl
Maxwell with Indian Girl

ముంబయి: ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రేమలో పడ్డాడ అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ భారత సంతతి అమ్మాయితో చెట్టాపట్టాల్ వేసుకుంటూ తిరుగుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ భారత సంతతి యువతి విని రామన్‌తో మ్యాక్స్‌వెల్ కొంతకాలంగా ప్రేమయాణం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ తరచూ హోటళ్లకు, పబ్‌లకు, పర్యాటక ప్రాంతాలకు వెళుతున్నారు. చివరికి క్రికెటర్ల అవార్డు కార్యక్రమానికి కూడా మ్యాక్స్‌వెల్ తన ప్రేమీకురాలు విని రామన్‌తో కలిసి వచ్చాడు. త్వరలోనే వీరిద్దరూ వివాహమాడబోతున్నట్టు తెలిసింది. కాగా దీనిపై అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాకున్న త్వరలోనే దీనిపై ఓ స్పష్టత వస్తుందని ఆస్ట్రేలియాకు చెందిన ఓ క్రికెటర్ తెలిపాడు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/