కరోనా ఔషధం ధర తగ్గించిన గ్లెన్‌మార్క్

103 నుండి 75కు తగ్గింపు

Glenmark Pharma cuts price of Covid-19 drug by 27 percent to Rs 75

ముంబై :కరోనా వ్యాప్తి నేపథ్యంలో గ్లెన్‌మార్క్ తన యాంటీవైరల్ ఔషధం ఫావిపిరవిర్ ధరను 27శాతం తగ్గించింది. ఫాబిఫ్లూ టాబ్లెట్‌ ధరను తగ్గించి 75 రూపాయలకు అందిస్తున్నట్టు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్  సోమవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ ఈ ఔషధాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టిన సమయంలో ఒక టాబ్లెట్ ధర 103 రూపాయలు అని నిర్ణయించింది. అయితే ప్రస్తుత తగ్గింపు ధరతో ఇప్పుడు ఒక్కో టాబ్లెట్ 75 రూపాయల కు లభించే అవకాశం ఉంది. ఇతర దేశాలలో ఫావిపిరవిర్ ఖర్చుతో పోల్చితే భారతదేశంలో ఫాబిఫ్లూను అతి తక్కువ మార్కెట్ ఖర్చుతో ప్రారంభించామని, ఇపుడు ఇండియాలో తయారు కావడం, అధిక ఉత్పత్తి కారణంగా తక్కువ ధరతో అందుబాటులోకి తెచ్చామని సంస్థ ఇండియా బిజినెస్ హెడ్‌, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ మాలిక్ వెల్లడించారు. తద్వారా కరోనా రోగులకు తమ ఔషధం మరింత చేరువ వుందని తాము ఆశిస్తున్నామన్నారు. అలాగే ఇండియాలో కరోనా రోగుల్లో కాంబినేషన్ థెరపీగా రెండు యాంటీవైరల్స్ డ్రగ్స్‌ షావిపిరవిర్, ఉమిఫెనోవిర్ సామర్థ్యాన్ని అంచనా వేసే మరో దశ 3 క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/