ఈ అణచివేత ఇంకా ఎన్నాళ్లు

నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం

Girls
Girls

దే శ భవిష్యత్తు పిల్లలపై ఆధారపడి ఉంటుంది. బాలబాలికలు జాతి సంపద, సమానత్వం, స్వేచ్ఛ, గౌరవం, వారసత్వం వ్యక్తిత్వం సార్వజ నీయత వంటివి అందరికీ సమానంగా వర్తించే మానవ హక్కుల లక్షణాలు. కానీ నేటి మనదేశ పరిస్థితులలో బాలికలు వాళ్ల హక్కులను పూర్తిగా పొందలేకపోతున్నారు. నేటి సమాజంలో బాలికలు, బాల్యవివాహం, విద్య అసమానత, లింగ ఆధారిత హింస, కుటుంబ సభ్యుల ప్రవర్తన, ఆత్మగౌరవం, పనిచేస్తున్న ప్రదేశాల్లో లైంగిక వేధింపులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి బాలిక హక్కులు సమానత్వం సమస్యల పరిష్కారం దిశగా ఈ తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. 2012 అక్టోబరు 11 నుండి ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నారు. బాలికల సాధికారత, వారి హక్కులు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలు, అవసరాల గురించి అవగాహన, పరిష్కారం చేయడం ఈ రోజు లక్ష్యం. మన చుట్టూ జరిగే అంశాలను పరిశీలించినప్పుడు బాలికల స్వేచ్ఛ, హక్కుల విధ్వంసం జరగడం మనం గమనిస్తూ ఉంటాం. బాలికల హక్కులు ఇలాంటి సందర్భాల్లో తరచుగా వెంటనే గుర్తుకు వస్తుంది. కుల మత, వర్గ, లింగ, ప్రాంత, భాష వంటి అన్నీ అంశాల లో బాలికల పట్ల వివక్షత కొనసాగుతున్న ది. దురదృష్టవ శాత్తు ఈ అంశా ల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని అన్ని వివక్షలకు దూరంగా మానవ హక్కుల సంస్కృ తిని అభివృద్ధి చేయవలసి ఉన్నది. మానవ సమాజంలో ఒక నూతన సంస్కృతి అవిష్కరణకు విద్యార్థి దశ నుండే పునాదులు వేయాలి. అందువలన పాఠశాలల్లో బాలబాలికల హక్కులను తప్పనిసరిగా నేర్పుటకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలి. భారత రాజ్యాంగంలో మహిళా హక్కులు ఆర్టికల్స్‌ ద్వారా పరిరక్షించబడుతున్నాయి. ఆర్టికల్‌ 14 ప్రకారం న్యాయం ముందు అంతా సమానం. ఆర్టికల్‌ 15 ప్రకారం మత, జాతి, కుల, లింగ పుట్టిన ప్రదేశాన్ని బట్టి వివక్ష చూపడం నిషేధం. ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించేహక్కు, స్వేచ్ఛ కలిగి ఉండే హక్కు, ఆహారం పొందే హక్కు, ఆశ్రయం పొందే హక్కు, మనకు రాజ్యాంగం కల్పించాయి. ఆడపిల్లలు వారి జీవితాలలో హక్కులను కోల్పోతున్నారు. ఇంకా అక్కడక్కడ బాల్యవివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమాల వలన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బాలికలలో అవగాహన వచ్చింది. ఈ రోజు ఎక్కువ మందిబాలికలు పాఠశాలకు హాజరవ్ఞతున్నారు. తక్కువ మంది చిన్నతనంలో పెళ్లి చేసుకుంటున్నారు. విద్య, ఉద్యోగానికి, ప్రాధాన్యత ఇస్తూ స్వేచ్ఛను పొందుతున్నారు. కొంత వరకు బాలికలలో వాళ్ల హక్కుల గురించి తెలుసుకుంటున్నారు. సమానత్వాన్ని సాధిస్తున్నారు.

  • నెరుపటి ఆనంద్‌
    తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/editorial/