12వ తరగతి బాలికను కడతేర్చిన స్నేహితుడు

భోపాల్: 12వ తరగతి చదువుతున్న బాలిక పాలిట తన స్నేహితుడే కాలయముడయ్యాడు. ఆమె స్కూల్ నుంచి తిరిగి వస్తున్న తరుణంలో అడ్డగించి తుపాకీతో కాల్చి చంపి, అనంతరం ఘటనా స్థలం నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని మోరినా జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు బాలికను ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని తెలిపారు. కాగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు, స్థానికులు పోలీసులపై ఆందోళనకు దిగి పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించి అల్లర్లను అదుపు చేశారు. అనంతరం నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. అయితే ఆ బాలికను గతకొన్ని రోజులుగా నిందితుడు లైంగికంగా వేధిస్తున్నాడని సమాచారం.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/