సాదాసీదాగా గిరీశ్‌ కర్నాడ్‌ కోరినట్లే అంత్యక్రియలు

girish karnad
girish karnad

బెంగుళూరు: ప్రముఖ నటుడు, నాటక రచయిత గిరీశ్‌ కర్నాడ్‌ కోరుకున్నట్లుగానే కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన కర్నాడ్‌ సోమవారం ఉదయం కర్ణాటకలోని తన నివాసంలో కన్నుమూశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కర్నాడ్‌కు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. ఐతే ఇందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కేవలం కుటుంబీకులు, సన్నిహితుల సమక్షంలో స్థానికి స్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించారు.
తాను చనిపోయాక సాదాసీదాగా కార్యక్రమాలు నిర్వహించాలని కర్నాడ్‌ తమతో ముందే చెప్పినట్లు కుటుంబీకులు మీడియా ద్వారా వెల్లడించారు. అభిమానుల సందర్శనార్ధం భౌతికాయాన్ని కూడా ఉంచలేదు. అంతిమయాత్ర సమయంలో అభిమానులు, పోలీసు బలగాలు వెంటరావడం వంటివి వద్దని కర్నాడ్‌ చెప్పారట. అందుకే ఆయన కోరుకున్నట్లుగానే అంత్యక్రియలను నిర్వహించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/