ప్రధానిని కలిసిన కాగ్‌ గిరీష్‌ చంద్ర ముర్ము

ప్రధానిని కలిసిన కాగ్‌ గిరీష్‌ చంద్ర ముర్ము
girish-chandra-murmu-pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడిని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గిరీష్ చంద్ర ముర్ము ఈరోజు కలిశారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఏడాది పాటు ఉన్న ఆయన ఈ నెల 8న ఆ పదవికి రాజీనామా చేసి కాగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడిని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి రామ్‌నాథ్ కోవింద్‌ను కూడా కలిశారు. గిరీష్ చంద్ర ముర్ము దేశానికి 14వ కాగ్‌గా నియమితులయ్యారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/