జిన్నా మూవీ ‘గోలిసోడా’ సాంగ్ రిలీజ్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నా చిత్రం నుండి ‘గోలిసోడా’ సాంగ్ వచ్చేసింది. . గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విష్ణు..ప్రస్తుతం జిన్నా అనే సినిమా చేస్తున్నాడు. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే, కోనా వెంకట్ అందించడం విశేషం. ఈ మూవీ తెలుగు తో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషలో రూపొందుతోంది. ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ తో సినిమా ఫై ఆసక్తి పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ లుక్ , టీజర్ విడుదలై ఆకట్టుకోగా..తాజాగా చిత్రంలోని ‘గోలిసోడా’ సాంగ్ ను రిలీజ్ చేసారు.

హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తో కలిసి విష్ణు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. అనుప్ రుబెన్స్ మ్యూజిక్ అందివ్వగా.. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. అక్టోబర్‌లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ మూవీ లో జిన్నా ప్రేయసిగా పచ్చళ్ల స్వాతిగా పాయల్ రాజ్ పుత్ కనిపించింది. నరేష్ – సునీల్ – వెన్నెల కిశోర్ – రఘుబాబు – చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. మంచు అవ్రమ్ భక్త సమర్పణలో ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుదేవా – గణేష్ ఆచార్య – ప్రేమ్ రక్షిత్ వంటి పాపులర్ డ్యాన్స్ మాస్టర్స్ ఈ సినిమాలో పాటలకు కొరియోగ్రఫీ చేశారు.