ఎయిర్‌పోర్టులో ఆజాద్‌ను అడ్డుకున్న పోలీసులు
భద్రతా కారణాల దృష్ట్యా

శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దుపై జమ్ముకశ్మీర్‌లోని కాంగ్రెస్ నేతలు, ప్రజలతో సమావేశమయ్యేందుకు కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ నేడు జమ్ముకశ్మీర్ వెళ్లారు. అయితే ఆయనను భద్రతా కారణాల దృష్ట్యా శ్రీనగర్ ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆజాద్‌ను విమానాశ్రయం నుంచే తిరిగి ఢిల్లీకి పంపించనున్నట్లు సమాచారం. కాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో జమ్ముకశ్మీర్ ప్రజలు విచారంలో ఉన్నారు. వారి బాధను పంచుకునేందుకు నేను వెళ్తున్నాను అని ఆజాద్ ఢిల్లీలో బయల్దేరే ముందు విలేకరులతో అన్నారు. ఆజాద్‌తో పాటు జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మిర్ మధ్యాహ్నం సమయంలో శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే రాష్ట్రంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న నేపథ్యంలో వీరిని విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/devotional/