గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ కు రాజీనామా ?

సీనియర్లపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ పార్టీలోని కొందరు సీనియర్లు బిజెపితో కుమ్మక్కయ్యారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై గులాం నబీ అజాద్ మాట్లాడుతూ సోనియాకు తాను రాసిన లేఖలో గతంలో రాహుల్ చెప్పిన విషయాలే ఉన్నాయని తెలిపారు. బిజెపితో కుమ్మక్కై సోనియాకు లేఖ రాశాననే విషయాన్ని నిరూపిస్తే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మరోవైపు పార్టీకి ఆజాద్ రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలోనే తన రాజీనామా లేఖను ఆయన పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/