సూర్యాపేట లో ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను విషాదంలో నింపుతున్నాయి. నిన్నటికి నిన్న జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద వార్త నుండి ప్రజలు బయటకు రాకముందే సుర్యాపేట లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పాలకీడు మండలం జాన్ పహాడ్ వద్ద TS05 UA5989 అనే నంబరు గల లారీ భీభత్సం సృష్టించింది. జాన్పాడు దర్గా నుంచి దామరచర్ల వైపు వెళ్తున్న రెండు బైకుల పైకి దామరచర్ల వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా ఢీ కొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

స్కూటీ పై ప్రయాణిస్తున్న మిర్యాలగూడ మండలం జంకు తండాకు చెందిన ధరావత్ పుణ్య(55), మగతి(50) భార్యాభ‌ర్త‌లుగా గుర్తించారు. లారీ కింద మరో రెండు మృతదేహాలు ఉన్నాయ‌నే అనుమానాన్ని స్థానికులు వ్య‌క్తంచేస్తున్నారు. లారీ కింద ఉన్న వారిని క్రేన్ సహాయంతో బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం మత్తులో లారీ డ్రైవర్ ఉండ‌టంవ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు.