మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

ఫిబ్రవరి 11న ఉదయం కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం

ghmc mayor election notification
ghmc mayor election notification

Hyderabad: జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి ఈ మేరకు నోటీఫికేషన్ విడుదల చేశారు.  ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12:30కు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఉంటుంది. ఎన్నిక పర్యవేక్షణకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమిస్తారు. కాగా, జీహెచ్‌ఎంసీలో పార్టీల వారీగా బలాబలాలిలా ఉన్నాయి.

మొత్తం 150 డివిజన్లకు గాను అధికార టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-48, మజ్లిస్‌-44, కాంగ్రెస్‌-2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఎక్స్‌ అఫిషియోలతో కలిపి పార్టీల బలాబలాలు పరిశీలిస్తే టీఆర్‌ఎస్‌కు 56 మంది కార్పొరేటర్లు. 35 మంది దాకా ఎక్స్‌ అఫిషియోల బలం. దీంతో వీరి బలం 91కి చేరుకుంటుంది.

బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు(అయితే కొవిడ్‌ కారణంగా లింగోజిగూడ కార్పొరేటర్‌ రమేష్‌ గౌడ్‌ మృతిచెందారు), ముగ్గురు ఎక్స్‌ అఫిషియోలతో కలిపి వారి బలం 50. మజ్లీస్‌కు 44 మంది కార్పొరేటర్లు. 10 మంది ఎక్స్‌ అఫిషియోలతో కలిపి వీరి బలం 54.

కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు, ఒక ఎక్స్‌ అఫిషియోతో కలిపి మూడు ఓట్లు ఉన్నాయి.. మొత్తం ఓట‌ర్ల సంఖ్య 198. మేయ‌ర్ పీఠం కైవ‌సం చేసుకోవాలంటే 100 మంది స‌భ్యుల బ‌లం కావాలి.. అయితే ఏ ఒక్క పార్టీకి అంత సంఖ్య బ‌లం లేదు… మేయ‌ర్ ఎన్నిక ఉత్కంఠ భ‌రితం కానుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/