వర్మకు జీహెచ్‌ఎంసీ జరిమానా..ఎందుకంటే..

నిబంధనలకు విరుద్ధంగా పోస్టర్..4 వేల రూపాయలు జరిమానా

Ram Gopal Varma
Ram Gopal Varma

హైదరాబాద్‌: వివాదాస్పద దర్శకులు రామ్‌గోపాల్‌వర్మకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. వర్మ ఇటీవలే పవర్ స్టార్ అనే సినిమాను రూపొందించి ఆన్ లైన్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నగరంలో పోస్లర్లు వేయించినట్టు ఫిర్యాదు రావడంతో, జీహెచ్ఎంసీ జరిమానా వేసింది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మొట్టమొదటి పోస్టర్ తనదేనంటూ వర్మ చేసిన ట్వీట్ ను ఆధారంగా చేసుకుని ఓ వ్యక్తి జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీ వర్మ నిబంధనలు అతిక్రమించాడని గుర్తించి 4 వేల రూపాయలు జరిమానాగా విధించింది. ఈ మేరకు చలానా జారీ చేసింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/