మేడ్చ‌ల్‌లో రూ.12 కోట్లతో నిర్మాణ వ్యర్ధాల ప్లాంట్‌

dana kishore
dana kishore, GHMC commissioner


మేడ్చల్‌: నగరంలోని జీడిమెట్లలో రూ. 12 కోట్లతో నిర్మాణ వ్యర్ధాల రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటును జిహెచ్‌ఎంసి కమీషనర్‌ దానకిశోర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వారం రోజుల్లో రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ట్రయల్‌ రన్‌ ప్రారంభిస్తామన్నారు. రోజుకు 500 మెట్రిక్‌ టన్నుల నిర్మాణ వ్యర్ధాలు రీసైక్లింగ్‌ చేసే అవకావం ఉందని తెలిపారు. మరో నాలుగు రీసైక్లింగ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. నిర్మాణ వ్యర్ధాలను అక్రమంగా పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, డంప్‌ చేసే వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos