రంజాన్ కోసం జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతీ వార్డులో ఒక మసీదును ఎంపికచేసి అక్కడ పేద ముస్లింలకు విందు భోజనం ఏర్పటుచేయడంతోపాటు దుస్తులతోకూడిన బహుమతిని ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(టీఎస్సీఓ) నుంచి వీటిని కొనుగోలుచేస్తున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బహుమతులు పంపిణీచేస్తున్న విషయం విధితమే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా వార్డుకు ఒకటి చొప్పున మసీదును ఎంపికచేసి కనీసం 500మందికి బహుమతులు పంపిణీ చేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. విందు కార్యక్రమానికి ఒక్కో మసీదుకు రూ లక్ష పంపిణీచేస్తున్నారు.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/