మున్నార్‌కు 100 మంది గాంధీలు రాక!


గాంధీజయంతికి ఈసారి కేరళ కాంగ్రెస్‌ ప్రత్యేకం

Gandhi
Gandhi


తిరువనంతపురం: మహాత్మాగాంధీ జయంతి రోజంటే దేశంలోనేకాదు ప్రపంచదేశాల్లో దేశభక్తికి నిదర్శనమైన రోజుగా పేర్కొంటుంటారు. ఈసారి గాంధీ జయంతికి కేరళలో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంటున్నది. కేరళలోని మున్నార్‌ కాంగ్రెస్‌కమిటీ గాంధీపేరున్న వారు అందరూ సమావేశానికి రావాలని ఆహ్వానాలు పంపించింది. అంతేకాకుండా కనీసం గాంధీ అనిపేరున్న ప్రతినిదులు వందమందికి తగ్గకుండా మా సమావేశానికి వస్తారని ధీమా వ్యక్తంచేస్తోంది. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా జాతిపితకునివాళిగా ఏడాదిపొడవునా కార్యక్రమాలునిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మున్నార్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఒక విశిష్టరీతిలో ఈకార్యక్రమాలను నిర్వహిస్తోంది. అంతేకాకుండా తమ ఆహ్వానాలకు వందమందికిపైగా స్పందించారని వెల్లడించింది. నెహ్రూపేరును సైతం చేర్చాలన్న డిమాండ్‌ పెరగడంతో మున్నార్‌కాంగ్రెస్‌ తర్వాత నెహ్రూపేరున్నవారు కూడా రావాలని ఆహ్వానించింది. గాంధీ పేరున్నవారిని సత్కరించుకోవడం మన విధి అని కనీసం వందమంది గాంధీలు, 60 మందికిపైగా నెహ్రూలు మున్నార్‌ కాంగ్రెస్‌ సమావేశానికి వస్తారని పిసిసి ఉపాధ్యక్షుడు ఎకె మణి వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు యువతరానికి మరింత స్ఫూర్తినిస్తాయని, జాతీయతాభావాన్ని పెంపొందిస్తాయని వెల్లడించారు. గాంధీజయంతిరోజు సత్కరించే ఈ గాంధీనెహ్రూల్లో కొందరు తాము ఈపేర్లనే పెట్టుకునేందుకు ఆయానేతలు ఏవిధంగా తమకు స్ఫూర్తినిచ్చింది కూడా ప్రసంగిస్తారని మణి తెలిపారు. పార్టీరహితంగా అందరినీ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రబ్బరు ప్లాంటేషన్‌ కార్మికుల్లో ఇప్పటికీ తమ పిల్లలకు దేశహీరోల పేర్లు పెట్టుకునేందుకు ఇష్టపడుతున్నారని, అనేక ఏళ్లనుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోందని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/