నవ్వుతో ఒత్తిడి నుంచి రిలాక్స్

ఆరోగ్య సూత్రాలు

Get rid of stress with laughter---
Get rid of stress with laughter

నవ్వు నాలుగు విధాలా మంచిందంటారు. మనల్ని ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. ప్రస్తుతం తీరిక దొరకని జీవనశైలిలో రోజుకు 18 సార్లే నవ్వుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. అది కూడా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడో, జాలీగా అనిపించినప్పుడో మాత్రమే నవ్వుతున్నారని అధ్యయనం చెపుతున్నది.

ఇదంతా ఎందుకంటే రోజులో ఎక్కువసార్లు నవ్వేవారు ఒత్తిడులను తేలిగ్గా తీసుకుంటారని ఒక విశ్వవిద్యాలయ పరిశోధకులు అంటున్నారు. రోజులో ఎన్నిసార్లు నవ్వుతారనేది ఆ రోజు వారికి ఎదురయ్యే పరిస్థితులు, అనుభవాల మీద ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంకో విశేషమేమిటంటే పురుషుల కన్నా మహిళలు సగటున రోజులో ఎక్కువసార్లు నవ్వుతారట. సైకాలజీ విభాగానికి చెందిన పరిశోధకులు ఇటీవల జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. రోజువారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని జయించడంలో నవ్వు పాత్ర మీద వారు ఈ అధ్యయనం చేసారు.

పరిశోధకులు తమ అధ్యయనానికి ఇరవై రెండు యేళ్ల లోపు ఉన్న సైకాలజీ విద్యార్థులను ఎంచుకున్నారు. వీరిలో 33 మంది అమ్మాయిలున్నారు. వీరికి మొబైల్‌ యాప్‌ ద్వారా కొన్ని ధ్వని సంకేతాలను పంపారు. వాటిని విని వీరంతా రోజుకు ఎనిమిది ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. అలా పద్నాలుగు రోజులు వారిని నిశితంగా పరిశీలించడంలో వారు ఎంత బిగ్గరగా నవ్వారు.

ఎన్నిసార్లు నవ్వారు, నవ్వడానికి కారణం, చివరి సంకేతం వచ్చే నాటికి ఒత్తిడి తాలూకు లక్షణాలు, ఒత్తిడి పెంచే సంఘటనలు ఏవైనా జరిగాయా వంటివి పరిశీలించారు. నవ్వు,
ఒత్తిడికి సంబంధించిన అంశాలు, దాని తాలూకు మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకున్నారు.

మొదటి ఫలితంలో ఎక్కువగా నవ్విన వారిలో ఒత్తిడికి కారణమయ్యే
విషయాలు, ఒత్తిడి లక్షణాలు చాలా తక్కువ కనిపించాయని తేలింది. రెండో ఫలితంలో
ఎలా నవ్వారు అనేది ఒత్తిడి మీద ప్రభావం చూపలేదు. అందుకు కారణం వాళ్లంతా
ఎన్నిసార్లు నవ్వామనే దాని మీదే దృష్టిపెట్టారు. అంతే తప్ప ఎలా నవ్వాము అనే దాని మీద కాదని పరిశోధకులు చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/