నేటి నుండి జర్మనీలో లాక్‌డౌన్‌

germany-lock down

జర్మనీ: జర్మనీలో కరోనా వ్యాప్తి విజిృంభణ కొసాగుతుంది. దీంతో ఈరోజు నుండి అక్కడ పాక్షిక లాక్‌డౌన్‌ పాటించనున్నారు. ఈ మేరకు జర్మన్ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్ లాక్‌డౌన్‌‌ నిబంధనలను ప్రకటించారు. ఫెడరల్ ప్రభుత్వం సోమవారం నుంచి కనీసం రెండు వారాలపాటు మొత్తం దేశాన్ని లాక్ చేయడానికి రాష్ట్రాలతో ఒక ఒప్పందానికి వచ్చిందని చెప్పారు.

నిబంధనలివే..

•రెస్టారెంట్లు, బార్లు మూసివేస్తారు. టేక్‌ అవేకు అవకాశం ఉంటుంది.
•పెద్ద పెద్ద సమావేశాలు రద్దు.
•అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలు నిషేధం.
•పర్యాటక ప్రయోజనాల కోసం హోటళ్లలో రాత్రిపూట బస నిషేధం.
•ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం.
•పది మందితో రెండు కుటుంబాలు మాత్రమే కలిసి శుభకార్యాలు చేసుకునేందుకు అనుమతి
•థియేటర్లు, సినిమాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌లు, స్టీమ్‌బాత్‌ సెంటర్లు మూసివేస్తారు.
•క్రీడాకార్యక్రమాలకు ప్రేక్షకులకు అనుమతి లేదు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/