జర్మనీలో వింత వ్యక్తి

ముఖం పుర్రెలాగా కనిపించాలని చెవులు కోసుకున్న వ్యక్తి

Tattoo addict chops off his own EARS and spends

జర్మనీ: ముఖాన్ని పుర్రెలా మార్చుకోవాలని భావించి, ఏకంగా రెండు చెవులను తొలగించుకున్నాడు. జర్మనీకి చెందిన 39 ఏళ్ల సాండ్రో అనే వ్యక్తి ఇప్పటికే పలు టాటూలతో ముఖాన్ని భయంకరంగా మార్చుకున్న సాండ్రో పిచ్చి పరాకాష్ఠకు చేరిందనడానికి నిదర్శనమే ఈ చెవుల తొలగింపు. దీనికోసం రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాడు. అన్నట్టు… కోసేసిన తన రెండు చెవులను ఇంట్లోనే భద్రపరుచుకున్నాడు. ఇంటా, బయటా ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని, తన ముఖమే తనకు ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని, ఈసారి ముక్కు తీసేయించుకుంటానని ఈ జర్మన్ వ్యక్తి తెలిపాడు. ముఖం పుర్రెలా కనిపించాలంటే ఈ మాత్రం రిస్క్ తప్పనిసరి అని పేర్కొన్నాడు. ఏదేమైనా సోషల్ మీడియాలో సాండ్రో ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/