ట్రంప్‌, జిన్‌పింగ్‌పై జార్జ్‌ సోరస్‌ విమర్శలు

George Soros
George Soros

దావోస్‌: అమెరికా, చైనాల్లో నిరంకుశ పాలకులు పాలన సాగిస్తున్నారని ప్రముఖ వితరణశీలి, వ్యాపారవేత్త అయిన హంగేరియనఅమెరికన్ జార్జ్ సోరస్ విమర్శించారు. అమెరికాలో డోనల్డ్ ట్రంప్, చైనాలో జీ జిన్‌పింగ్ అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేదని వ్యాఖ్యానించారు. భారత ప్రధాని నరేంద్ర మోడిపైనా ఆయన విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో భారత ప్రభుత్వం కటువైన చర్యలు చేపడుతోందని, దేశంలో లక్షల మంది ముస్లింలకు పౌరసత్వాన్ని దూరం చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. మోడి ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370ని నిర్వీర్యం చేయడం, వివాదాస్పద భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)‌ను తీసుకురావడాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోసగాడని, ఆయన అమెరికా రాజ్యాంగం హద్దులు మీరారని సోరస్ వ్యాఖ్యానించారు. చైనీయుల జీవితంపై పూర్తి నియంత్రణ సాధించేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని తప్పుబట్టారు. జనాకర్షక రాజకీయ విధానాలు(పాపులిజం), వాతావరణ మార్పుల ముప్పు పెరుగుతోందని హెచ్చరించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/