ట్రంప్ ప్రయత్నాలకు అడ్డుకట్ట

సైన్యాన్ని దించడం కుదరదన్న రక్షణ మంత్రి

donald trump
donald trump

అమెరికా: అమెరికాలో అల్లర్లు అదుపులోకి తెచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతోంది. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత అమెరికాలోని 140 నగరాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. దీంతో సైన్యాన్ని దించుతామని ట్రంప్ బెదిరించారు. అయితే, ఇప్పుడు ట్రంప్ ఆదేశాలకు అడ్డుకట్ట తగిలింది. అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ సైన్యాన్ని దింపే ప్రక్రియను తిరస్కరించారు. సైన్యం దించడం చివరి ఆప్షన్ అని మార్క్ ఎస్పెర్ స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పట్లో అవసరం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/