కొన్ని రోజుల్లో జియో వైఫై కాలింగ్‌ సేవలు

వైఫై కాలింగ్‌ ద్వారా వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు

jio wifi calling launch
jio wifi calling launch

ముంబయి: మొబైల్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేని సమయంలో ఫోన్‌ కాల్స్‌ చేసుకునేందుకు వైఫై కాలింగ్‌ సదుపాయం ఉపయోగపడుతుంది. కాగా ప్రముఖ టెలికాం కంపెనీ జియో వైఫై కాలింగ్‌ సేవల్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. గత కొన్ని రోజులుగా పరీక్షల దశలో ఉన్న ఈ సదుపాయాన్ని ఎట్టకేలకు జియో ప్రకటించింది. జనవరి 16 వరకు దశలవారీగా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. వైపై కాలింగ్‌ సేవల్ని ఉపయోగించి వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చని జియో తెలిపింది. ఎయిర్‌టెల్‌ వైపై కాలింగ్‌ ఫీచర్‌ను ప్రకటించిన కొన్ని రోజులకే జియో ఈ ఫీచర్‌ను ప్రకటించడం గమనార్హం. కాగా గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ అందుబాటులో లేనప్పుడు దగ్గర్లోని ఏ వైపై నెట్‌వర్క్‌ కనెక్ట్‌ అయినా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని జియో చెబుతోంది. దీని కోసం అదనంగా ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని ఇందుకోసం మీ ఫోన్‌లోని వైపై సెట్టింగ్స్‌లో వైపై కాలింగ్‌ ఆప్షన్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/